షర్మిల మమ్మల్ని తిడితే.. మేము వైఎస్‌ తిట్టల్సి వస్తుంది – జగ్గారెడ్డి

-

వైఎస్‌ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. షర్మిల జగన్ వదిలిన బాణం కాదు.. వదిలేసిన బాణం అని చురకలు అంటించారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారని ఆరోపించారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారా.. వైఎస్ఆర్ కూతురు కాబట్టి తిడితే మేము ఊరుకుంటామా? అని ఆగ్రహించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉంటే నీకెందుకు.. ఏడ తిరిగితే నీకెందుకు అని షర్మిలపై ఫైర్‌ అయ్యారు. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడో తెలివి ఉన్న వాళ్ళందరికీ తెలుసని… నేను పార్టీలు మార్చిన చరిత్ర అంతా నా ప్రజలకు తెలుసు అన్నారు. షర్మిల మమ్మల్ని తిడితే.. మేము వైఎస్‌ తిట్టల్సి వస్తుందని హెచ్చరించారు. మమ్మల్ని గెలుకుడు ఎందుకు… Ys నీ తిడుతూ ఉండటం ఎందుకు అన్నారు. Trs లో పని చేసుకుంటూ ఉన్న నన్ను… పిలిచింది వైఎస్ కాదా..? ఆ సంగతి నీకు తెలియదా… నా శీలం కరాము చేసిందే వైఎస్సార్ అని రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news