నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది – KA paul

నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా? మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారని ఆగ్రహించారు.

కేసీఆర్…తెలంగాణలో ఈ గుండాయిజం ఎంటి? నన్ను హైదరబాద్ లో తెలంగాణాలో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారా? అంబేడ్కర్ సెక్రటేరియట్ ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఎంటి? వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఎంటి? అని నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయిందని పేర్కొన్నారు.

నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని..దేవుడు కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడని వెల్లడించారు. దేవుడికి నచ్చకనే సెక్రటరీయెట్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడని..అవినీతి ఎంతో కాలం చెల్లదు. కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలి. మారాలన్నారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవలేడు. ప్రధాని ఏం అవుతాడు? అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని తెలిపారు. పేరు ఒకరిది… పండు ఒకరిదా? సచివాలయం ప్రారంభంపై హైకోర్టులో పిల్ వేసాను. హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద నా వాదనలు వినిపించా అని నిలదీశారు కేఏ పాల్.