స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టేందుకు ఈ హోమ్‌ రెమిడీస్‌ ట్రై చేయండి..!

-

డెలివరీ తర్వాత చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సాధారణం. కానీ ఇది చూసేందుకు ఏం బాగుండవు. చీరలు కట్టుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. గర్భం దాల్చిన 90% మంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టుకోవడానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటికి క్రీమ్స్‌ కూడా ఉంటాయి కానీ… వాటిల్లో కెమికల్స్‌ ఉంటాయి. దాని వల్ల బేబీకి కూడా ఎలర్జీ రావొచ్చు.. ఈ హోమ్‌ రెమిడీస్‌ ట్రై చేయండి.
స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టుకోవడానికి కలబంద ఒక గొప్ప ఔషధం. కలబందలో విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక భాగాలు ఉన్నాయి. అందువల్ల, కలబందను ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది.
రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ మిక్స్ చేసి ప్యాక్ తయారు చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్‌ని స్ట్రెచ్‌మార్క్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి కొంత సేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత దానిని గుడ్డతో తుడిచివేయవచ్చు. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి.
స్ట్రెచ్ మార్క్స్ వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఉత్తమ పరిష్కారం. కొబ్బరి నూనెలో అమినో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం యొక్క స్థితిస్థాపకత మరింత మెరుగుపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
బేకింగ్ సోడా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగిస్తుంది. అదే సమయంలో, నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం సాగిన గుర్తులను తొలగించడంలో సహాయపడుతుంది.
ఈ చిట్కాలను ట్రై చేయడం వల్ల మీ స్ట్రెచ్ మార్క్స్‌ను సులభంగా తొలగిస్తాయి. అయితే ఒక్కసారి చేయగానే రిజల్ట్‌ కనిపించదు. మీరు తరచూ వీటిని ఫాలో అయితేనే మీ సమస్య పూర్తిగా నయం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news