నేటి నుంచి 23 వ తేదీ వరకు ఈడి కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పరిచింది ఈడి. కవితను గంటపాటు రోజు కలిసేందుకు ఆమె భర్త అనిల్ ,కుటుంబ సభ్యులకు సమయం కేటాయింపులు చేశారు. అయితే… ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో 292 కోట్ల రూపాయల వ్యవహారాన్ని తేల్చాల్సి ఉందని…292 కోట్ల రూపాయలు వ్యవహారంతో కవితకు సంబంధం ఉందని ఈడీ ఆరోపణలు చేసింది.
100 కోట్ల రూపాయలను అప్ పార్టీకి హవాలా రూపంలో ఇచ్చారని…
హైదరాబాదులోని కోహినూర్ హోటల్ విజయనాయర్ , అరోరా లు కలిసి సమావేశం అయ్యారని వెల్లడించింది ఈడీ. ఢిల్లీలోని సోడాపూర్ వద్ద రెండు బ్యాగులలో నగదును వినోద్ చౌహాన్ కి అందించారని…అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బు మొత్తాన్ని ఆప్ నేత వినోద్ కు ఇచ్చాడని ఆరోపణలు చేసింది ఈడీ. హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో డబ్బు మొత్తాన్ని అప్ కు చేరవేశారని..శరత్, మాగంటి, రామచంద్ర పిళ్ళై ఇండోస్పిరిట్లకు లబ్ధికై డబ్బు ఇచ్చారని…ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ తెలిపిందని సమాచారం.