టీఆర్ఎస్ మంత్రి కవిత ? ఈ పిలుపు ఎప్పుడో ?

-

కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు టిఆర్ఎస్ లో మారుమోగుతోంది. ఆమె నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో, ఆమెలో ఆనందాలు వెలువరిస్తున్నాయి. ఇక ఆమె ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడంతో, త్వరలోనే మంత్రి కాబోతున్నారని ఇప్పుడు హడావుడి మొదలైంది. త్వరలోనే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లే ఆలోచనలో ఉండడం, కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే  ప్రచారం జరుగుతుండడం , వంటి పరిణామాల నేపథ్యంలో కవితను ప్రభుత్వంలో  యాక్టీవ్ చేస్తారా లేఖ పార్టీలో యాక్టివ్ చేస్తారా అనే సందిగ్ధత ఇప్పుడు టిఆర్ఎస్ లో నెలకొంది. ఆమెకు మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశంతోనే 15 నెలల్లో ముగియబోతోంది అని తెలిసినా, ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కవితను గెలిపించుకున్నారనే టాక్  కూడా ఉంది.
ఇక కాంగ్రెస్ బీజేపీలు ఈ స్థానంలో  డిపాజిట్లు సైతం దక్కించుకోలేక పోయాయి. ఆ పార్టీ ఓట్లు కూడా టిఆర్ఎస్ తరఫున కవిత దక్కించుకోగలిగారు. ఇప్పుడు ఆమె మంత్రి పదవి పైన జోరుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అసలు ఎమ్మెల్సీ కంటే ఆమెను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ ముందు నుంచి భావిస్తూ వచ్చారు. జాతీయ రాజకీయాల్లో తనకు చేదోడువాదోడుగా ఉండేందుకు కవిత ఉపయోగపడుతుందని కెసిఆర్ భావించగా, ఆమె మాత్రం నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు మొగ్గు చూపించారు.
కవిత కు ఆ పదవి ఇచ్చే నిమిత్తం ఎవరి పదవిని కెసిఆర్  ఊడ గొడతారో అనే టెన్షన్  మంత్రుల్లోనూ నెలకొంది. అయితే కెసిఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లి పోతే,. తెలంగాణ ముఖ్యమంత్రిగా  కే టిఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని , ఆయన నిర్వహించిన శాఖలనే  కవిత నిర్వహిస్తారని ప్రచారం ఒక వైపు, టిఆర్ఎస్ బాధ్యతలు మొత్తం కవిత అప్పగిస్తారని, పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతలు కేటీఆర్  ఒక్కరే మోయ లేరు అని, అందుకే కెసిఆర్ కవితకు మంత్రి పదవులతో పాటు, పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి నుంచే కవిత కు  మంత్రి పదవి అప్పగించాలంటూ పార్టీలోని  నాయకులంతా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అతి తొందరలోనే ఈ తంతు కూడా పూర్తయ్యేలా కనిపిస్తోంది. త్వరలోనే దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు,  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత, కవితకు కేటీఆర్  ఒకేసారి ప్రమోషన్ కల్పించే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కవిత మాత్రం టీఆర్ఎస్ మంత్రి కవిత అని పిలిపించుకోవాలి అని తహతహలాడిపోతున్నారట.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news