ఈనెల 11న సీఎం కల్వకుంట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టినన ” వరి పోరు” ఢిల్లీ వేదిక కానుంది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో తో ఈనెల 11న హస్తినలో దీక్ష చేయనున్నారు టిఆర్ఎస్ ముఖ్య నేతలు. గత నెలలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రుల బృందం కోరిన..కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో వరి పోరుపై కార్యాచరణను ప్రకటించింది టిఆర్ఎస్ పార్టీ.సీఎం కేసీఆర్ ఈ నెల 3న ఢిల్లీ వెళ్లారు.12వ తేదీ వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టిఆర్ఎస్ వర్గాలు చెప్పినప్పటికీ, 11న జరిగే నిరసన దీక్షలో ఆయన పాల్గొనే అంశంపై మాత్రం గోప్యతను పాటిస్తున్నాయి.
రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుమారు 1500 మంది టిఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలోని దీక్షకు హాజరవుతున్నట్లు అంచనా.దీక్షకు ఆహ్వానం అందిన టిఆర్ఎస్ పార్టీ నేతల కోసం రెండు ప్రత్యేక విమానాల తో పాటు ప్రత్యేక రైలు బోగీలు బుక్ చేశారు. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్షా స్థలాన్ని పరిశీలించి, తగు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.