కేసీఆర్ కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించలేదు – పొన్నం ప్రభాకర్

-

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకే హథ్ సె హథ్ జోడో పాదయాత్ర కార్యక్రమం చేపట్టామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విసునూర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అల్లుడు వస్తే ఎక్కడ పసుకోవాలే అన్న కెసిఆర్ డబల్ బెడ్రుమ్ ఇల్లు ఎక్కడ పోయినాయని ప్రశ్నించారు.

ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అగ్గి పెట్టె ఇండ్లని ఎద్దేవా చేశారు. 609 స్థానంలో ఉన్న ఆధాని ని బిజెపి ప్రపంచంలో 9 స్థానానికి తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ఉన్న అప్పు ఎంత..? ఇపుడున్న అప్పు ఎంత…? అని నిలదీశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ లేదని..10 గంటలే వస్తుందన్నారు. కరెంట్ తీగలను పట్టుకోమని టిఆర్ఎస్ అన్న మాటను స్వాగతిస్తున్నామని, కరెంట్ తీగలను పట్టుకోవడానికి సిద్ధం అంటూ సవాల్ విసిరారు.

కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో అనేక వేధింపులకు గురవతున్నారని.. అక్రమ కేసులు పెట్టి బైండవర్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణా ముఖ్యమంత్రి స్వంత జాగిరు కాదన్నారు పొన్నం ప్రభాకర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు మహారాష్ట్రకు ఎలా పంపిస్తావని.. శ్రీ రామ్ సాగర్ నీరు చుక్క ముట్టినా రక్తపు మరకలేనని హెచ్చరించారు. దేవాలయాలకు నిధులు కేటాయిస్తానని దేవుళ్ళకు, ప్రజలకు క్షటగోపం పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొండగట్టు బస్ ప్రమాదం జరిగేతే బాధితులను పరమర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news