కేసీఆర్ ‘డబుల్’ యాక్షన్.. ఇంకా తగ్గేదే లే!

-

హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు వరకు అసలు కేసీఆర్ ప్రగతి భవన్, ఫాంహౌస్ దాటి వచ్చిన సందర్భం పెద్దగా లేదు..అసలు రెండోసారి సీఎం అయ్యాక…కేసీఆర్ పెద్దగా జనాల్లోకి రాలేదు…కానీ అనూహ్యంగా కేసీఆర్‌కు కాంగ్రెస్, బీజేపీల రూపంలో పెద్ద ఇబ్బంది మొదలైని..రెండు పార్టీలు రేసులోకి రావడంతో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఓ వైపు బీజేపీకి బండి సంజయ్, కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక పరిస్తితి మారిపోయింది…అలాగే ఈటల రాజేందర్ లాంటి వారు టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరడంతో కేసీఆర్ బయటకు రాక తప్పలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచి బయటకొచ్చారు…దళితబంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చారు.

అయితే హుజూరాబాద్‌లో బీజేపీ చేతిలో ఓడిపోయాక కేసీఆర్‌కు మరింత జ్ఞానోదయం అయినట్లు ఉంది..అందుకే బీజేపీతో డేంజర్ అని గమనించి..ఆ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు..అలాగే కాంగ్రెస్‌ని టార్గెట్ చేయకుండా పరోక్షంగా ఆ పార్టీని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మధ్య ఏ విధంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు..పైగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టారు..అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం నడపడటం స్టార్ట్ చేశారు..అలాగే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తని సెట్ చేసుకుని దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

ఇంకా చెప్పాలంటే కేసీఆర్ డబుల్ యాక్షన్ చేసేస్తున్నారు…ఓ వైపు రాష్ట్రంలో, మరోవైపు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా ఉన్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ఇతర పార్టీల నేతలని కలుస్తున్న విషయం తెలిసిందే.

ఇటు రాష్ట్రంలో బీజేపీని ఎదగనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..అలాగే ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ డబుల్ రోల్‌లో తగ్గేదేలే అన్నట్లు ముందుకెళ్లనున్నారు. జాతీయ స్థాయిలో మరింత మందిని కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని పెద్దగా చేయాలని చేస్తున్నారు..ఇటు రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు చేయనున్నారు..మొత్తానికి కేసీఆర్ డబుల్ యాక్షన్ షురూ చేశారని చేప్ప్కోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news