ఢిల్లీ నీటి సమస్యపై కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య తీవ్రమైంది. దీంతో ఢిల్లీ మంత్రి అతిషి ఏకంగా ఢిల్లీ సీపీకి వాటర్ పైపులైన్లకు భద్రత కల్పించాలని కోరడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నీటి సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భారతదేశంలో పొలిటికల్ సక్సెస్ అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలు తీర్చడం కాదు.

ఇమాజినరీ ఇష్యూలు, ఊహాజనిత సమస్యలు, అవగాహనలు నిర్మించి ఎన్నికలు గెలిచినప్పుడు వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందని  ప్రశ్నించారు కేటీఆర్. వారు చెప్పినట్లే ఏదైతే అదే కానివ్వండి” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news