హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో బిజెపి మూడో విడత పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా.. అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బీజేపీ శ్రేణులు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. తమ సభ ఏర్పాటు చేసుకొనివ్వకుండా అనుమతి నిరాకరించారని బిజెపి నేతలు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ బన్న ఐలయ్య సభకు అనుమతి రద్దు చేస్తూ లేఖ రాశారు.
శనివారం నిర్వహించే ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు. ఈ సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే రేపు ఎట్టి పరిస్థితిలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించి తీరుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. కార్యకర్తలు అంతా వందేమాతరం, భారత్ మాతాకీ జై, జైశ్రీరామ్, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
కెసిఆర్ నీకు దమ్ముంటే ఆపుకో అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. సభ నిర్వహించుకునేలా కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నానని అన్నారు. తాము కోర్టు తీర్పుని పాటించే వాళ్లమని అన్నారు బండి సంజయ్.