యాదవులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే… ఎకరాకు రూ.10వేల చొప్పున పంట నష్ట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని తక్షణమే అమలు చేయాలని సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాల పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం ఆదేశించారు.