తెలంగాణలో భారీ వర్షాలు..కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ

-

తెలంగాణ, మన రాష్ట్ర ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో., కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగాఉంచాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

అందుకు సంబంధించి, తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక అటు శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక క్రమంగా పెరిగింది. శనివారం 71 వేల క్యూసెక్కుల వరద రాగా.. 24 గంటల్లో 1.75 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం ఉదయం సమయంలో రెండు లక్షల క్యూసెక్కుల విడుదల ఉండగా సాయంత్రానికి 1.57 లక్షల క్యూసెక్కులు నమోదయింది. మానేరు, ప్రాణహిత, ఇతర ప్రవాహాలు కలిపి లక్ష్మీ(మేడిగడ్డ) వద్ద వరద పెరుగుతోంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి దిగువకు 5.05 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగర్‌ దిగువన కూడా నదిలో ప్రవాహం పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news