వీకెండ్స్‌లో క్రికెట్‌ ఆడటానికి పర్మిషన్.. వరుడి ఫ్రెండ్స్ కు బాండ్ రాసిచ్చిన వధువు

-

ప్రేమలో పడినా.. పెళ్లైనా అబ్బాయిలు తమ ఫ్రెండ్స్ ని మరిపోతుంటారని స్నేహితులెప్పుడూ గోల చేస్తుంటారు. అది నిజం కూడా. గర్ల్ ఫ్రెండ్ ని బాధపెట్టకూడదని.. భార్యతో కాసేపు సరదాగా గడపాలని ఫ్రెండ్స్ ని పట్టించుకోవడం మానేస్తారు. ముఖ్యంగా పెళ్లైన తర్వాత ఇక ఫ్రెండ్స్ ని అప్పుడప్పుడు పలకరించడమే కష్టం.. ఇక రోజూ కలిసి చిల్ అవ్వడం అంటే అస్సలు కుదరని పని. ఇలా ఓ వ్యక్తి పెళ్లి జరుగుతోంటే.. ఆ వేడుకకు వచ్చిన ఫ్రెండ్స్ తమ స్నేహితుడి కోసం ఆ నవవధువు వద్ద ఓ కండిషన్ పెట్టారు. అదేంటంటే..?

తమిళనాడులోని మదురైలో.. వారాంతాల్లో క్రికెట్‌ ఆడేందుకు తన భర్తను అనుమతిస్తానని ఓ నవవధువు బాండ్‌ పేపరుపై రాసి ఇవ్వాల్సి వచ్చింది. హరిప్రసాద్‌ తేనీలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈయన ‘సూపర్‌స్టార్‌’ క్రికెట్‌క్లబ్‌ జట్టుకు కెప్టెన్‌ కూడా. ఇతడికి మదురైకు చెందిన పూజ అనే యువతితో వివాహం ఏర్పాటు చేశారు.

పెళ్లికి వచ్చిన వరుడి స్నేహితులు పెళ్లికుమార్తెకు ఓ షరతు విధించారు. శని, ఆదివారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని పెళ్లి కుమార్తెను కోరారు. ఆ మేరకు రూ.20 బాండు పేపరు మీద సంతకం కూడా చేయించారు. మొదట్లో ఆట పట్టిస్తున్నారేమో అనుకొన్న పూజ.. క్రికెట్‌ విషయంలో స్నేహితులకు ఉన్న పట్టుదలను చూసి సంతకం చేయక తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news