తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదన్నారు CM రేవంత్. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ మాట్లాడుతూ… తొలి విడత తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపిత అన్నారు. రెండో విడత తెలంగాణ ఉద్యమంలో ప్రొ. జయశంకర్ తెలంగాణ జాతిపిత అన్నారు రేవంత్. కానీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదన్నారు CM రేవంత్.
బీఆర్ఎస్ కుప్పకూలిపోయింది.. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. పరోక్షంగా బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు మా టార్గెట్ అన్నారు. 100 రోజుల పరిపాలన చూసే తీర్పు ఇవ్వాలని కోరుతున్నాం.. 100 రోజుల్లోనే అన్నీ అయిపోవాలంటే ఎలా? అంటూ ఆగ్రహించారు సీఎం రేవంత్ రెడ్డి.