కేసీఆర్ పనికి కడియం, తుమ్మల నొచ్చుకోలేదా..? : ఈటల రాజేందర్

-

కేసీఆర్ వద్ద అంతో ఇంతో తప్పును తప్పు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఈటల అని తెలిపారు రాజేందర్. తాజాగా మీట్ ది ప్రెస్ లో పాల్గొని మాట్లాడారు.  గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న జూపల్లి, తుమ్మల, కడియం, పట్నం మహేందర్ రెడ్డి తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పడంతోనే తాను కేసీఆర్ వద్ద ఆగ్రహానికి గురయ్యానన్నారు. ‘హౌసింగ్ పాలసీ మీద కేసీఆర్ కమిటీని వేశారు. ఇందులో తనతో పాటు హరీశ్ రావు, తుమ్మల, ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి వారం ఉన్నారు.

తాము స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వకముందే పాలసీని డిక్లేర్ చేశారు. అప్పుడు ఇదే కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు నొచ్చుకున్నారన్నారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు ఉన్న విలువ అర్ధం చేసుకోవచ్చు’ అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా అమలు కావట్లేదన్నారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది అని మహిళల పట్ల సానుభూతి కలిగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని సోనియా గాంధీ ఓ మహిళాగా ఉండి కూడా ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఛాన్సే లేదని మోడీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news