మానకొండూర్ లో రసమయి బాలకిషన్ ని గెలిపిస్తే.. హుజూరాబాద్ లా మానకొండూర్ నియోజకవర్గానికి మొత్తం దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే. పెత్తనం ఆఫీసర్లది ఉండే. ఇప్పుడే హక్కులు మీకే ఇచ్చాం. మీ బొటనవేలితో మీ భూమి హక్కు మారుతుది. మీ భూమిని సీఎం కూడా మార్చలేడు. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని తీసి ఉంచుకుంటారా..? పొడగొట్టుకుంటారా..?
దయచేసి నిర్ణయం చేయాలి. ఆలోచన చేయాలి. మళ్లా ధర్నాలు, నిరసనలు, బాలకిషన్ పాటలు.. మన బతుకే ఉద్యమమా..? గత పదేండ్ల నుంచి 70 ఏండ్లలో లేనంత శాంతంగా ఉంది తెలంగాణ. ఎవరికి తోచిన పని వారు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం కుదుటపడ్డది. రైతుల ముఖాలు తెల్లవడ్డాయి. గ్రామాల్లో ఇండ్లు కట్టుకున్నాం. పల్లెల్లో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానాలు, నియోజకవర్గంలో 100, 200 పడకల దవాఖానాలు, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.