టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి బంజారాహిల్స్‌ లో భూమి కేటాయించిన కేసీఆర్‌ సర్కార్‌

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌ కార్యాలయం నిర్మాణం కోసం.. కేసీఆర్‌ సర్కార్‌ భూమిని కేటాయించింది. హైదరాబాద్‌ జిల్లా కార్యాలయం కో సం కేసీఆర్‌ సర్కార్‌ బంజారాహిల్స్‌ లో భూమిని కేటాయించింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 లోని ఎన్‌బీజీ నగర్‌ లలో 4935 చదరపు గజాల ప్రభుత్వ భూమిని టీఆర్‌ఎస్‌ పార్టీకి కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ జీవో జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్‌ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో నిర్మాణాలు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. హైదరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ.. జిల్లా కార్యాలయం కూడా నిర్మించాలని పార్టీ నాయకత్వం కొంత కాలంగా ప్రయత్నాల్లో ఉంది. ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టర్‌ నివేదిక మేరకు 10 వ తేదీన సీసీఎల్‌ఏ సిఫార్సు చేయగా.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.