కేసీఆర్ కు ఎమ్మెల్యేలు అసలు నచ్చడం లేదా…?

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బందికరంగానే ఫీలవుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకపోవడం, కొంతమంది మంత్రులు కూడా సహకరించకపోవడం పార్టీ కార్యకర్తలకు దగ్గరగా లేకపోవడం వంటి సమస్యలు టిఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా కనిపించాయి. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం కేసీఆర్ కొన్ని రిపోర్టులు కూడా తెప్పించుకున్నారు.

సీఎం కేసీఆర్

ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు విషయంలో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలో అనుకున్న విధంగా ఓట్లు రాకపోవడం వెనుక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తప్పులే కనపడుతున్నాయి అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

అందుకే ఇప్పుడు సీఎం కాస్త కొంతమంది విషయంలో సీరియస్ గా  ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే క్యాబినెట్లోకి కొంతమందిని తీసుకువచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లను క్యాబినెట్లోకి తీసుకురాకుండా ఉండడమే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు. భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. కానీ కొంత మంది ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మాత్రం కొత్త వారికి బాధ్యతలు అప్పగించడానికి సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కూడా ఎమ్మెల్యేల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

TOP STORIES

శ్రీరామనవమి స్పెషల్: పానకం, వడపప్పు ప్రసాదం ఇలా ఈజీగా చేసేయండి…!

శ్రీ రామ నవమి అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున ఇళ్ళల్లో, దేవాలయాల్లో కూడా శ్రీ రామునికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే...