ఆంధ్రప్రదేశ్ పరిణామాల ఆధారంగా చూస్తే… తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. పరిస్థితులు పార్టీకి అనుకూలంగా కనబడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది.
అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు నాయుడుకు సహకారం అందడం లేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని భావిస్తున్నారు. కొన్ని అంశాలను ఎక్కువగా అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. కానీ ఈ విషయంలో ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబునాయుడు సహకారం అందడం లేదు.
ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు మాట్లాడాలని ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కూడా ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు పెద్దగా హాజరయ్యే ప్రయత్నం చేయటం లేదు. దీని కారణంగా కొన్ని సమస్యలు పార్టీలో వస్తున్నాయి. గతంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా వాళ్ల నుంచి సహకారం చంద్రబాబు నాయుడుకు లేదు ఈ సమస్యను తెలుగుదేశం పార్టీ పరిష్కరించకపోతే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ గొంతు వినపడే అవకాశం ఉండకపోవచ్చు. మరి దీనిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధిగమిస్తారు ఎమ్మెల్యేలను ఏ విధంగా దారిలో పెట్టుకుంటారు అనేది చూడాలి.