పరిస్థితుల ప్రభావం… జగన్ రూట్లోకే వచ్చిన కేసీఆర్!

-

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ పై వస్తున్న విమర్శల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది అనడంలో అనుమానం లేదు!! ఈ విషయంపై స్పందించినవారంతా చెప్పేది ఒకటే మాట… “కేసీఆర్ కి ఏమైంది… తెలంగాణ సర్కార్ ఎందుకిలా చేస్తుంది”? అని! అన్ని సదుపాయాలు ఉన్న ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు ఉన్న ఇబ్బంది ఏమిటి… చిత్తశుద్ధి లోపం తప్ప అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! దీంతొ తాజాగా జగన్ రూట్లోకి వచ్చేసే ఆలోచన్లు చేసినట్లున్నారు కేసీఆర్!

కరోనాపై పోరాటంలో మొదట్లో.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షాలు కురిసేవి. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్య గొలిపేవి. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం మీద ఇంటా బయటా అనేక విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. విచిత్రం ఏమిటంటే… రాను రానూ ఈ విషయంలో దేశంలోనే పరీక్షలు అతి తక్కువగా చేస్తోన్న రాష్ట్రం అంటూ.. ఆసుపత్రులు అందుబాటులో లేవని చెబుతూ.. తెలంగాణ సర్కార్ పై విమర్శలు రాగా… కరోనా విషయంలో జగన్ చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి!! దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయాయ్నికి వచ్చింది!

ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం ఐసీఎంఆర్ సూచించిన ఆర్టీ-పీసీఆర్ పద్ధతిలోనే కోవిడ్ – 19 పరీక్షలు చేస్తూ వచ్చింది. ఆ పరీక్షలు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నవి. పైగా ఫలితాలు రావడానికి మూడు-నాలుగు రోజులు సమయం పడుతుంది. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్స్ తెప్పించి విరివిగా టెస్టులు చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ మధ్యే పది లక్షల టెస్టుల మార్కును కూడా దాటేసింది! దీంతో… హైకోర్టు ఆదేశాలు, జనాల డిమాండ్ల నేపథ్యంలో ర్యాపిడ్ టెస్టులనే ఆశ్రయించక తప్పలేదు తెలంగాణ సర్కార్ కి.

తాజాగా తెలంగాణలో వేలసంఖ్యలో టెస్టుల సంఖ్యలు చేయడం తాజా విశేషం. వీటిలో మెజారిటీ పరీక్షలు ర్యాపిడ్ కిట్స్‌తో చేసినవే! దీంతో… ఇక రోజూ కనీసం పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేయాలని తెలంగాణ సర్కార్ ఫిక్సయ్యిందంట. ఆ రేంజ్ లో టెస్టుల సంఖ్య పెరగితే.. తెలంగాణలో కేసుల సంఖ్య కచ్చితంగా రికార్డులు సృష్టించొచ్చని అంటున్నారు హైదరాబాదీలు!!

Read more RELATED
Recommended to you

Latest news