గజ్వేల్ లో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు కేటాయించిన డబ్బులను కాంగ్రెస్ వాళ్లు ఆపి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. రైతులకు భరోసాను ఇవ్వండి.. సాగు విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేయాలన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే గా కేసీఆర్ ను గెలిపించిన సందర్భంగా గజ్వేల్ పట్టణం లోని శోభా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు హాజరయ్యారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతుంది, పది పదిహేను రోజుల్లో ఆయనే గజ్వేల్ కి వస్తారు.కర్ణాటకలో ఆరు నెలలైనా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదు, అక్కడ ఆంటీ కాంగ్రెస్ నడుస్తుంది.రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి అదే అయితది.కొండపొచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుండి నీళ్ళు విడిచి చెరువులలో నీళ్ళు నింపాలని గజ్వేల్ నుండి డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు హరీశ్ రావు.