ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటులు వస్తున్నాయి. ముఖ్యంగా.. 40 ఏళ్ల లోపు అలాగే, స్కూల్ కు వెళ్లే వారికి కూడా గుండె పోటులు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో.. గుండెపోటు ఘటనలతో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్డియోపల్మోనరి రిససిటేషన్ లో లక్ష మందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపాదికన ప్రారంభించింది. ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డిఫీబ్రిలేటర్ పరికరాలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచనుంది.
కాగా, ఇటీవల కాలంలో.. చాలా మంది సెలబ్రీటీలు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తారక రత్న గుండెపోటుతోనే మరణించారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్, విశ్వసుందరి సుస్మితసేన్ హార్ట్ ఎటాక్ భారిన పడింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తనకు గుండె పోటు వచ్చినట్లు.. సోషల్ మీడియాలో తెలిపింది.