బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

-

హిందూ దేవుళ్ళు, అయ్యప్ప పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు బైరి నరేష్. డిసెంబర్ 19న జరిగిన కార్యక్రమానికి ఉద్దేశపూర్వకంగానే భైరి నరేష్ ని పిలిచినట్లు హనుమంతు ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో ఉంది.

నరేష్ పై గతంలోనే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హనుమకొండలో రెండు కేసులు, నవాబ్ పేట పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు. నలుగురు ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఉమాపతి గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు బైరి నరేష్ పై 200 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news