కోకపేట సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుసైడ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాగ ప్రభాకర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ లో తీవ్రంగా నష్టపోయిన ప్రభాకర్.. పలు చోట్ల లక్షల రూపాయల్లో అప్పులు చేశాడట. అయితే.. ఆ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడట సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రభాకర్.
వాస్తవంగా..కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. 7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరునంలోనే.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు….మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే… కోకాపేట్ లో హాస్టల్ గదికి వచ్చి తనువు చాలించాడు నాగ ప్రభాకర్. కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.