కోమటిరెడ్డికి బిగ్ షాక్..’కోవర్ట్ వెంకట్ రెడ్డి’ అంటూ పోస్టర్లు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర ‘కోవర్ట్ వెంకట్ రెడ్డి’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. కోమటిరెడ్డికి 13 ప్రశ్నలు సంధిస్తూ, ‘నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన’ అని అందులో రాశారు.

కాంగ్రెస్‌ పార్టీ చేసిన డిజిటల్‌ సభ్యత్వం ఉన్నదా అంటూ ప్రశ్నిస్తూ, సొంత గ్రామంలో సర్పంచ్‌, ఎంపీటీసీ లను గెలిపించుకోలేని అసమర్థుడు అని పేర్కొన్నారు ఈ పోస్టర్లలో..! సొంత తమ్మున్ని నార్కట్‌ పల్లి లో జెడ్పీటీసీ గా ఎందుకు గెలిపించుకోలేదని, నకిరేకల్‌ మున్సిపాలిటీ లో రెండు కౌన్సిలర్ల ను కూడా గెలిపించుకో లేకపోయాడని విమర్శలు చేశారు. సొంత సోదరున్ని గెలిపించుకోలేని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్టార్ క్యాంపెయినర్‌ అవుతాడని పోస్టర్లలో ప్రశ్నించారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరూ పెట్టారో తెలియ రాలేదు.