తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ.. ఈ రోజు వెంకట్‌రెడ్డి షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా ధరించిన ఫొటోను షేర్ చేశారు సోదరుడు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఈ ఫొటో చూసి వీరు ఇంకా బీజేపీతో ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. బీజేపీకి సద్దులు మోస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. ?? అంటూ ఫైర్ అవుతున్నారు. వెంకట్‌రెడ్డి పోస్టు చేసిన బర్త్‌డే విషెస్ ఫొటో దేనికి సంకేతం? అంటూ నిలదీస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో పిక్ మార్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కాంగ్రెస్ కండువా ధరించిన ఫొటోతో పోస్టు అప్‌డేట్ చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.