కాంగ్రెస్ లో చేరిన నుంచి చెరకు సుధాకర్ నన్ను తిడుతున్నాడని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న ఆడియో టేప్ వైరల్ కావడంపై కోమటి రెడ్డి స్పందించారు. నేను భావోద్వేగంతో చేసిన వాఖ్యలే..వేరే ఉద్దేశ్యం లేదని… 33ఏళ్ళ రాజకీయ ఎప్పుడు నా రాజకీయ ప్రత్యర్ధుల పై గాని ఎవరి పై కూడా దూషించలేదని పేర్కొన్నారు. నా శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం నాది..తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని వెల్లడించారు.
చదువుకున్న వ్యక్తి గా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చాం… నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూసానని వెల్లడించారు. నేను మాట్లాడిన విషయాలు కట్ చేసారు..కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేసారు..రికార్డు పెట్టారని నాకు తెలుసు అన్నారు.
చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే..నేనే కోట్లాడా..నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకు కు చెప్పానని చెప్పారు కోమటి రెడ్డి. నన్ను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అనడం వల్లే..భాధతో మాట్లాడానని పేర్కొ న్నారు.