తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని హెచ్చరించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు తీహార్ జైల్లో కవిత తో ములాఖాత్ కానున్నారు కేటీఆర్, హరీష్ రావులు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో కేటీఆర్, హరీష్ రావులు…. సీనియర్ అడ్వకేట్ల తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం అన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం నిర్వహించినట్లు చెప్పారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తెలిపారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు…పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.