రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. ఏకంగా ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు సవాల్ విసిరారు. ‘తెలంగాణ అభివృద్ధిపై చర్చించే దమ్ము మాకు ఉంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రగతిపై మాట్లాడే దమ్ము మీకుందా’ అంటూ ఛాలెంజ్ చేశారు.
బీజేపీ నేతలు అసమర్థులని.. తాను చేసిన ఛాలెంజ్‌ను వాళ్లు స్వీకరించలేకపోతున్నారని అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, దేశంలో తెలంగాణ రాష్ట్రం కన్నా మెరుగైన అభివృద్ధి సాధించిన ఒక్క రాష్ట్రం పేరు చెప్పాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేటీఆర్ సవాల్ చేశారు. మోదీ కానీ బాధ్యతాయుతమైన బీజేపీ కేంద్ర మంత్రి ఎవరైనా కానీ తన సవాల్‌కు స్పందించాలని డిమాండ్ చేశారు. కానీ బీజేపీ నేతల్లో స్పందన లేకపోవడం వారి అసమర్థతను బయటపెడుతోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
I had challenged @narendramodi Ji or any responsible BJP Union Minister to name a state in India that has performed better all round than Telangana in last 9 years👇
Their reluctance/inability to respond speaks volumes https://t.co/ztynO31sGh
— KTR (@KTRBRS) April 12, 2023