వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ మీడియా తో తెలంగాణా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు.. అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం కేసీఆర్ అంటున్నారు.. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది.. టికెట్ల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని ప్రకటించారు కేటీఆర్.
మూడోసారి కూడా కేసీఆరే తెలంగాణ సీఎం.. అని వెల్లడించారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి…కేవలం ఒక పార్టీని అధికారంలో నుంచి దించడానికి బీఆర్‌ఎస్ రాలేదని తెలిపారు మంత్రి ktr. దేశంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉన్నాయనే ఆలోచన విధానం తప్పు అన్నారు కేటీఆర్. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ను వదిలేసి ఎన్జీవోను గానీ, దుకాణాన్ని గానీ నడుపుకోవాలి చురకలు అంటించారు మంత్రి కేటీఆర్.