3 నెలలు మొబైల్స్ పక్కనపెట్టండి..జాబ్ కొట్టండన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు మంత్రి కే తారక రామారావు. ఈ సందర్భంగా మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ… ప్రతిభకు ఆకాశమే హద్దని.. వచ్చే 3/ 4 నెలలు మొబైల్ ల వాడకం ను తగ్గించండని పేర్కొన్నారు.
3 నెలలు ప్రణాళిక బద్దంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని యూత్ కు సలహాలు ఇచ్చారు. జీవితం చాలా పెద్దది, అపజయం ఎదురైతే బేజారు కావొద్దని సూచించారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ప్రతి పాదిక నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నారు. 8 ఎండ్లలో సాగునీటి రంగలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తి పోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించామని గుర్తు చేశారు.