‘అగ్నివీర్​లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారా ? : కేటీఆర్ ట్వీట్

-

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. అంతేకాదు.. ఇవాళ భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు ఆందోళన కారులు. దీంతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది.

అయితే…ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ అగ్నిపథ్‌ పథకం వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన స్టైల్‌ లో స్పందించారు. అగ్ని వీరులను.. సెక్యూరిటీ గార్డులుగా నియామకం చేస్తారా అని నిలదీశారు.

అగ్నిపథ్‌ పథకం వల్ల యువత… డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లు, వాషర్‌ మెన్లు ఉపాధి పొందవచ్చునని కేబినేట్‌ మంత్రి కిషన్‌ రెడ్డి చెబుతున్నారు. అగ్ని వీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని మరో బీజేపీ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీజీ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా అని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news