సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించిన కేటీఆర్

-

అగ్నిపద్ స్కీమ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.” అగ్నివీర్ స్కీం కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు. దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. వన్ ర్యాంక్- వన్ పెన్షన్ నుంచి.. ప్రతిపాదిత నో ర్యాంక్- నో పెన్షన్ వరకు!” అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్లిన ఆర్మీ అభ్యర్థులు.. రాళ్లతో రైలు పై దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు.రాళ్లు రువ్వడంతో భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారని సమాచారం.దీంతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ లకు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news