ఈ వర్షాకాలంలో ఒక్క ప్రాణం కూడా పోవద్దు : మంత్రి కేటీఆర్

-

తెలంగాణలో వర్షాలు షురూ అయ్యాయి. రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వానలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఒక్క ప్రాణం కూడా పోవద్దని.. ఆ దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, రాజధాని పరిధిలో వర్షాకాల సన్నద్ధతపై కేటీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నాలాలపై సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు.

వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం కింద జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనుల పురోగతిపై మంత్రి సమీక్ష జరిపారు. చాలాచోట్ల నాలాల నిర్మాణం పూర్తయిందని, గతంతో పోలిస్తే వరద సమస్య తీవ్రత తగ్గనుందని ఇంజినీర్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన మోటార్లు, పంపులను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.పాలన వికేంద్రీకరణ, పౌర సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా డివిజన్‌కు ఒకటి చొప్పున జీహెచ్‌ఎంసీ ఈ నెల 16న వార్డు కార్యాలయాలను ఏర్పాటుచేసింది. వాటి పనితీరు ఎలా ఉందని అధికారులను కేటీఆర్‌ అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news