హైకోర్టును ఆశ్రయించిన రేణు దేశాయ్

-

 

ప్రముఖ నటిగా, మోడల్ గా, డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో భారీ పాపులారిటీ అందుకున్న రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో ముంబైలో జీవిస్తోంది.

అయితే… తాజాగా హైకోర్టును ఆశ్రయించారు రేణు దేశాయ్‌. హైదరాబాద్ కోత్వాల్ గూడలో ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం చేపట్టవద్దని… సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య సహా పలువురు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నిర్మాణం వల్ల సముద్ర జీవులు, పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయంపై అధ్యయనం చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మున్సిపల్, HMDA, పశుసంవర్ధక శాఖలకు నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 4లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news