మేకిన్‌ తెలంగాణ నినాదానికి కంటివెలుగు నిజమైన ఉదాహరణ: కేటీఆర్‌

-

కంటి వెలుగు కార్యక్రమంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చొరవతీసుకొని ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం మేకిన్‌ తెలంగాణ నినాదానికి నిజమైన ఉదాహరణ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్‌లోని తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్‌లోని అకృతి ఐకేర్, కంటివెలుగు కోసం 25 లక్షల కళ్లఅద్దాలు పంపిణీ చేసినట్లు వివరించారు.

85 వేల ఖర్చుతో కూడిన కంటి ఇంప్లాంట్‌, కంటికవచాలకు 8 లక్షలు రీడింగ్ గ్లాసెస్‌కు 38 లక్షలు, కంటి ఫ్రేమ్‌ల కోసం 14 లక్షలు ఖర్చుచేసినట్లు తెలిపారు. కేవలం కంటి వెలుగు కోసం మాత్రమే కాకుండా ఆకృతి సంస్థ ఇప్పటికే 15 దేశాలకు కళ్లద్దాలు ఎగుమతి చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

మరోవైపు కంటివెలుగు క్యాంపుల నిర్వహణకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కంటి వెలుగుపై సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలోని 80 శాతం వార్డులు, 66 శాతం పంచాయతీల్లో కంటి పరీక్షలు పూర్తిచేసినట్లు అధికారులు వివరించారు. 59 రోజుల్లో కోటి 17 లక్షల మందికి కంటిపరీక్షలు చేసినందుకు అధికారులకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news