లేటైనా లేటెస్టుగానే స్పందించిన కేసీఆర్… వాట్సప్ నెంబర్ కూడా ఇస్తారంట!

-

రెండు రోజుల క్రితం వచ్చిన ఒక రిపోర్ట్… “దేశ వ్యాప్తంగా సగటున 7.2 శాతం పాజిటివ్ కేసులు నమోదైతే, తెలంగాణలో 21 శాతం నమోదయ్యాయి” అని! ఈ ఒక్క మాట చాలు తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. తెలంగాణలోని కరోనా బాధితుల్లో హోం మంత్రి, స్పీకర్ సహా మొదలైన ప్రజాప్రనిధులు కూడా ఉన్నారు.. కాకపోతే వారంతా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు! వారి పాలనలో వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారు చికిత్స ఎందుకు చేయించుకోరు? ఆ మిలియన్ డాలర్ల ప్రశ్నను కాసేపు పక్కనపెడితే.. కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా.. లేటైనా లేటెస్టుగానే స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్!

అవును… ఇంతకాలం “మొద్దునిద్రపోతుంది” అన్న విమర్శను సంపాదించుకున్న తెలంగాణ సర్కార్ తాజాగా… కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతినిచ్చింది. ఉచిత వైద్యానికి రాష్ట్ర వ్యాప్తంగా 20 మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది! అందులో భాగంగా ప్రస్తుతం.. మల్లారెడ్డి, కామినేని, మమత మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసింది టి.సర్కార్! అదేవిధంగా… రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17వేలకుపైగా బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెబుతున్నారు అధికారులు!

తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్… ప్రైవేట్ ఆస్పత్రుల నియంత్రణకు త్వరలో వాట్సాప్ నెంబర్ తీసుకువస్తున్నామని.. కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతివ్వడం జరిగిందని.. అయితే వాటిపై కొద్ది రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆ విషయంలో బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఒక వాట్సప్ నెంబర్‌ ను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు తెలియజేస్తామని చెబుతున్నారు.! సో… ఎంతకంతే… కేసీఆర్ లేటైనా లేటెస్టుగానే స్పందించారని అంటున్నారు టి. ప్రజలు!

Read more RELATED
Recommended to you

Latest news