సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హస్తంలో ఆరుగురి జాబితా ఉందట. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. వచ్చే వారమే కొలువురు దీరనుందట రేవంత్ పూర్తి స్థాయి క్యాబినెట్. అధిష్టానం చేతిలో 6 గురు నూతన మంత్రుల జాబితా ఉందని సమాచారం.
రేసులో విశాఖ అధినేత, సుశి ఇన్ఫ్రా అధినేత, హైదరాబాద్ మాజీ మంత్రి, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, హైద్రాబాద్ ,రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయట. ఉమ్మడి నల్లగొండకు మూడు పదవులపై రేవంత్ కు తలనొప్పిగా మారినట్లు సమాచారం. ముస్లిం మైనారిటీ నుండి ఒకరికి అవకాశం ఉండనుంది. మంత్రి పదవిపై ముదిరాజ్, లంబాడా వర్గాల ఆశలు ఎక్కువ అయ్యాయి. మరి 6 గురు నూతన మంత్రులు ఎవరనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.