10వ తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యింది – మధుయాష్కి

పదవ తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ మధుయాష్కి. చదువురాని వాళ్ళకి ప్రయివేట్ యూనివర్సిటీలు ఇచ్చాడన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే యూనివర్సిటీలు బాగుండేవి.వీడయ్య సొత్తా? వీడబ్బా సొత్తా? ఇదేమైనా రాచరికం అనుకుంటున్నాడా కేసీఆర్?? అని నిప్పులు చెరిగారు మధుయాష్కీ.

అవినీతి చేయకున్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు.. అవినీతి చేసిన కేసీఆర్ పై బీజేపీ ప్ర‌భుత్వం మౌనం. కేసీఆర్ పై విచారణ చేయకపోతే ఆయన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని అంగీక‌రించిన‌ట్లేనని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కంటే ఇప్పుడు దుర్భ‌ర‌ పరిస్థితులు తెలంగాణ‌లో నెల‌కొన్నాయి…మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అని క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పై మండిపడ్డారు.కేసీఆర్ ఎవర్ని కలవకుండ ప్ర‌జాస్వామ్యంలో దొర‌స్వామ్యాన్ని చూపిస్తున్నాడన్నారు. తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఇప్పటికీ మొండా మార్కెట్ లో రెంట్ కట్టకుండా వ్యాపారం చేసేవాడు…తన అవినీతి బద్దలైతదనే కేసీఆర్ వరంగల్ వెళ్ళాడన్నారు. కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని ఆగ్రహించారు మధుయాష్కి.