వరంగల్ జిల్లాలో ఇద్దరు మవోయిస్టులు, ముగ్గురు సానుభూతిపరులతో సహ ఐదుగురిని అరెస్ట్ చేశారు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు మరో ముగ్గురు సానుభూతిపరులను టాస్క్ఫ ర్స్ మరియు హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన మావోయిస్టుల నుండి పోలీసులు 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటనేటర్లు, 74వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం , ఒక బోలెరో కారు, సెల్ ఫోన్లు, అధార్ మరియు ఎన్నికల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ చేసిన వారిలో.. మడకం ఉంగి అలియాస్ కమల, (దండకారుణ్య సౌత్ సబ్ జోన్ డాక్టర్స్ టీం కమాండర్), అసం సోహెన్ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు, నేషనల్ ఏరియా సభ్యుదన్. మీచ అనిత ( క్రాంతికారి ఆదివాసి మహిళ సంఘ్ అధ్యక్షురాలు, మవోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ), సభ్యురాలు. గొడ్డి గోపాల్, (ఆర్.పి.సి అధ్యక్షుడు), మావోయిస్టు సానుభూతి పరుడు.కందగుర్ల సత్యం లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. వీరందరూ చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వారే.