బిజెపిలో చేరనున్న మర్రి శశిధర్ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో.. అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి… త్వరలోనే పార్టీ మారన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హోమ్ మంత్రి అమిత్‌షాతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి భేటీ..అయ్యారు.

బండి సంజయ్‌, డీకే అరుణతో కలిసి అమిత్‌షాతో సమావేశమయ్యారు మర్రి శశిధర్‌రెడ్డి. ఇక త్వరలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. శశిధర్ రెడ్డి తో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి… బిజెపి తీర్థం తీసుకోరున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.