కూకట్ పల్లిలో భారీ చోరీ.. కాపలా ఇంటికే కన్నం వేసిన నేపాలి

-

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో భారీ చోరీ జరిగింది .ఇంటికి వాచ్మెన్ గా పని చేస్తూ రక్షణ కల్పించాల్సిన ఓ నేపాలీ అదే ఇంటికి కన్నం వేశాడు. వివరాల్లోకి వెళ్తే ..కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్ రావు ఇంట్లో.. ఎనిమిది నెలల క్రితం చక్రధర్ అనే నేపాలీ తన భార్య సీత, మూడేళ్ళ కుమారుడితో కలిసి వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్నారు .

అప్పటి నుండి నమ్మకంగా పని చేస్తున్న నేపాళీ వాచ్ మెన్ ఈ నెల 6వ తేదీన బంధువుల వద్దకు వెళ్తున్నామని నాగపూర్ వెళ్ళి, తమతో పాటు ఓ గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చిఋ .మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దామోదర్ రావు కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలో ఓ ఫంక్షనుకు వెళ్ళారు..ఇదే అదనుగా భావించిన చక్రధర్, గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు ఇంటి తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించారు .

30 లక్షల నగదు, 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని ఆటోలో కుటుంబంతో సహా పరారయ్యారు .దామోదర్ రావు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేంతో కేసు నమోదు చేసిన పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దొంగలు లక్డీకాపూల్ వరకు వెళ్లారని గుర్తించారు.మాదాపూర్ డిసిపి అధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news