పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగానే పోటీ.. 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

-

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి మమతాబెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడబోయే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. అందులో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌, ప్రస్తుత ఎంపీ మహువా మొయిత్రా సహా నురుల్ ఇష్లాంకు, శత్రుజ్ఞ సిన్హా, కీర్తి ఆజాద్ వంటి తదితర పేర్లు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్‌లో ఎవరితోనూ పొత్తులు లేవని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు. కాగా, మమతాబెనర్జీ ఇవాళ లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారం ప్రారంభించారు. కోల్‌క‌తా బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో మెగా ర్యాలీ ద్వారా ప్రచార శంఖారావాన్ని పూరించారు.

జ‌న గ‌ర్జన స‌భ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీకి రాష్ట్ర నలుమూలల నుంచి ల‌క్షలాది మందిని టీఎంసీ స‌మీక‌రించింది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు బ‌కాయిలు విడుదల చేయ‌డంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఈ స‌భా వేదిక‌గా మ‌మ‌తా బెన‌ర్జీ విమర్శించారు. రాష్ట్రంలోని 42 లోక్‌స‌భ స్థానాల్లో బీజేపీని ఓడిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news