ఆ మంత్రి పేరు బయటపెట్టాలి.. ఈటల వ్యాఖ్యలకు గంగుల కౌంటర్

కరీంనగర్: తనను చంపేందుకు ఓ మంత్రి కుట్ర చేసినట్లు మాజీ మావోయిస్టు చెప్పారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఆ మంత్రి పేరు బయటపెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. తన పేరు ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందన్నారు.

ఈటలతో రాజకీయ వైర్యమే తప్ప వ్యక్తిగత కక్షలు లేవని గంగుల చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజల నమ్మొద్దని సూచించారు. ఈటల ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేపతామన్నారు. లేదంటే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర దర్యాప్తు సంస్తలతో విచారణ చేయించుకోవవచ్చన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇందుకు సహకరించాలని కోరారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పారో ఈటల బయలపట్టాలని డిమాండ్ చేశారు.