తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకారం.. అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన విపంచి ఆడిటోరియంలో ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం జరిగింంది.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 27 వేల మంది ఆశ కార్యక్రర్తలుగా మీరు బలోపేతమైతే వైద్య శాఖ బాగుంటుందని… ఇంటింటికి జ్వర సర్వే చేశాం. కేంద్రం మెచ్చుకుంది. అందరికీ మనమే ఆదర్శం జ్వర సర్వే సూపర్ హిట్ అన్నారు. కరోనా రాక ముందే కోటి కిట్స్ అందుబాటులో పెట్టుకుని, 2 కోట్ల టెస్టింగ్ కిట్స్ పెట్టుకున్నామని వెల్లడించారు.
నా ఆలోచనలు పంచుకోవాలని, ఉందని డాక్టర్ అవతరమెత్తి వైద్య అంశాలు ఒక్కొక్కటిగా చెబుతూ.. వైద్య రంగంలో చాలా వసతులు తేవాలని దిశానిర్దేశం చేశారన్నారు. జనం ఆసుపత్రికి రాకుండా ఉంటేనే ఆనందం. ప్రజారోగ్యం బాగుండాలన్నదే మన తపనగా ఉండాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పని బాగుండాలి. గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షకులు మీరే. గ్రామ ప్రజలకు మీరే బాధ్యులు. మీరే బాధ్యత ఉండాలని పిలుపునిచ్చారు.