ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దయింది. చంద్రాయన గుట్టపై ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా వేసుకున్నారు మంత్రి కేటీఆర్. బిజెపి నేతల అరెస్టు, ఆందోళనల నేపథ్యంలో చాంద్రాయణగుట్టపై ఫ్లైఓవర్ ఓపెనింగ్ ను వాయిదా వేశారు అధికారులు. బిజెపి నేతలు అడ్డుకుంటారన్న సమాచారంతో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని ఈనెల 27కు వాయిదా వేశారు అధికారులు.
చాంద్రాయణ గుట్ట వద్ద ట్రాఫిక్ సమస్యను అధికమించేందుకు రూ. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో యుటిలిటీ షిఫ్టింగ్, భూ సేకరణ కలిపి మొత్తం అట్టి వ్యయంతో ఫ్లై ఓవర్ ను చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ నాలుగు లైన్లను రెండు వైపులా 674 మీటర్ల పొడవుతో నిర్మాణం చేశారు. తద్వారా కందికల్ గేట్, బార్కాస్ జంక్షన్ ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లై ఓవర్ పై నుండి వెళ్ళవచ్చు. ఈ ఫ్లైఓవర్ రెండు వైపులా నిర్మాణం చేపట్టిన నేపథ్యం ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుండి శంషాబాద్ వైపు వెళ్లేందుకు సకాలంలో చేరుటకు వీలవుతుంది.