సిరిసిల్లాలో భారీ వర్షపాతం .. కేటీఆర్‌ కీలక ఆదేశాలు

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా జులై లో అత్యధిక వర్షం నమోదు అయ్యింది.. ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతo నమోదు అయినట్లు చెప్పారు.

జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని.. అయినా ఉదాసీనంగా, ఆలక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దని… ప్రాఫర్ గా మున్సిపాలిటీ ల తో సహా అన్ని గ్రామాలలో సేఫ్టీ అడిట్ జరగాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని.. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలి. బ్యారికెడ్ ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news