కథారచన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ ఉన్న సినిమ దేశం అంతా అడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు ? అని కేసీఆర్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము కూడా పాన్ ఇండియా కి వెళ్తున్నామని.. నాకు సినిమా తో పాటు క్రియేటివ్ కంటెంట్ అంటే ఇష్టమన్నారు.
నేను రోజు 11, 12 పేపర్లు చదువుతానని..అలాగే మంచి బుక్స్ కనపడినా చదువుతానని వెల్లడించారు. అమెరికా లో మాక్ డేమిన్ వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లే బుక్ ను చదివానని..తెర వెనుక ఉన్న టెక్నీషియన్స్ కు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. కరోనా టైం లో మాట్లాడేటప్పుడు అందరూ టివిలకు అతూక్కుపోయేవారని.. మన సినీ పరిశ్రమ ని సౌత్ హబ్ గా తీర్చి దిద్దాలి అనేది మా ప్రయత్నమని చెప్పారు కేటీఆర్.