కులగణన పై కసరత్తు.. మరో రెండు రోజుల్లోనే..!

-

తెలంగాణ  ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన కులగణన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు, పలువురు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కులగణన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించామని  తెలిపారు. విధి విధానాలను నెల రోజుల్లో పూర్తి చేసి.. పకడ్బందీగా కులగణన నిర్వహిస్తామని వెల్లడించారు.

మరో రెండు రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి.. బీసీ, ఎస్సీ కమిషన్లను సైతం
ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కులగణన పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు
వెళ్తామని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కులగణన పూర్తి చేసి, కొత్త రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news