అమరజ్యోతి నిర్మాణంలో రేవంత్ ఆరోపణల్ని ఖండించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

-

తెలంగాణ అమరవీరుల త్యాగం నిత్యం ప్రజ్వాలిల్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు తెలంగాణ అమరజ్యోతిని కూడా నిర్మించింది. దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన జూన్ 22న అమరుల స్మారక చిహ్నాన్ని.. అమరజ్యోతిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందని ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరిట కేసీఆర్ ప్రజల సొమ్మును దుబారా చేసి.. దగా చేశారని విమర్శించారు.

రేవంత్‌ రెడ్డి ఆరోపణలను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తిప్పికొట్టారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచిత మనస్తత్వం రేవంత్‌దని దుయ్యబట్టారు. అమరజ్యోతి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో చేపట్టింది తప్ప… ఓట్ల రాజకీయాల కోసం కాదన్నారు. రేవంత్‌రెడ్డి  ఆరంతస్థుల అమరజ్యోతిని సందర్శించి అక్కడ ఏర్పాట్లు చూస్తే గొప్పతనం అర్థమవుతుందని మంత్రి హితవు పలికారు. రేవంత్‌వి మతిలేని మరగుజ్జు మాటలన్న ప్రశాంత్‌రెడ్డి….అమరవీరుల త్యాగాలపై మాట్లాడే నైతికహక్కు ఆయనకుగానీ, కాంగ్రెస్‌కు గానీ లేదన్నారు

Read more RELATED
Recommended to you

Latest news